తెలిసో తెలీకో జగన్మోహన్ రెడ్డికి ఒక విషయంలో ఎల్లోమీడియా మద్దతుగా నిలిచింది. అదేమిటంటే  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను జగన్ అండ్ కో ఎప్పటినుండో ప్యాకేజీస్టార్ అని ర్యాగింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాలను రక్షించేందుకు భారీగా డబ్బులు తీసుకుని పవన్ రాజకీయాలు చేస్తున్నట్లు జగన్ బహిరంగ వేదికలమీదే ఆరోపిస్తున్నారు.   పవన్ వైఖరి కూడా అందుకు అనుమానించేట్లుగానే ఉంటోంది. తాజాగా ఎల్లోమీడియా తనపైన ప్యాకేజీస్టార్ అని ముద్రేసినా పవన్ ఎందుకని నోరెత్తటంలేదు.

అయితే పవన్ పై జగన్ అండ్ కో ఆరోపణలు చేయటం ఎలాగున్నా ఎల్లోమీడియా కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. తనను ప్యాకేజీస్టార్ అంటే చెప్పుతో కొడతానని పవన్ వార్నింగ్ ఇచ్చారు. మరిపుడు ఎందుకని నోరెత్తలేకపోతున్నారు ? ‘వెయ్యి కోట్ల రూపాయలు అయినా పర్వాలేదు నేను చూసుకుంటాను మీరు నాతో చేతులు కలపండి’ అని పవన్ కు కేసీయార్ బంపరాఫర్ ఇచ్చారని ఎల్లోమీడియా స్పష్టంగా చెప్పింది. 


సరే లాజిక్కులు, మ్యాజిక్కులను పక్కన పెట్టేస్తే కేసీయార్ వెయ్యి కోట్ల రూపాయల బంపరాఫర్ ఇచ్చారన్నదే హైలైట్. రాబోయే ఎన్నికలకు సంబంధించి కేసీయారే ఇంత భారీ మొత్తంలో ఆఫర్ ఇచ్చారంటే మరి ఇప్పటికే అనుకూలంగా పనిచేస్తున్న కారణంగా పవన్ కు చంద్రబాబు ఇంకెంత  ప్యాకేజీ ఇచ్చుంటారో అని జనాలు అనుమానించేట్లుగా ఉంది కథనం. తన కథనంలో ఎల్లోమీడియా ఏమి చెప్పదలచుకున్నదో అర్ధంకావటంలేదు. అయితే పవన్ మాత్రం ముమ్మాటికీ ప్యాకేజీస్టారే అని ముద్ర వేసినట్లుంది.

ఇక్కడే నెటిజన్లు సోషల్ మీడియాలో పవన్+ఎల్లోమీడియాపై రెచ్చిపోతున్నారు.  మొదటినుండి జగన్ అండ్ కో చెబుతున్నట్లు పవన్ ప్యాకేజీస్టారే అని అభిప్రాయపడుతున్నారు. జగన్ ఆరోపణలకు ఎల్లోమీడియా తాజా రాతలే సాక్ష్యాలంటున్నారు. పవన్ను ప్యాకేజీస్టార్ అని జగన్ అండ్ కో అనటంలో తప్పేమీలేదని కూడా నెటిజన్లు తీర్మానించేశారు. ఎల్లోమీడియా ఏ ఉద్దేశ్యంతో పవన్ పై కథనం రాసిందో తెలీదు కానీ కథనం మొత్తం జగన్ ఆరోపణలకు మద్దతుగా ఉన్నట్లే ఉంది. ఈ కథనంపై పవన్ నోరెత్తకపోవటమే అసలైన విచిత్రం. మరింత సమాచారం తెలుసుకోండి: