మార్గదర్శి చీటింగ్ కేసులో ముందు ముందు ఇంకా చాలా కతుందని అర్ధమవుతోంది. మార్గదర్శి ద్వారా అక్రమ డిపాజిట్లు సేకరించటం కోస ఆర్బీఐ, చిట్ ఫండ్ చట్టాన్ని ఛైర్మన్ హోదాలో  చెరుకూరి రామోజీరావు, ఎండీ హోదాలో శైలజా కిరణ్ ఉల్లంఘించారని సీఐడీ కేసు నమోదుచేసింది. రామోజీ  ఏ1గా, శైలజను ఏ2 గా కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన మొదటి విచారణే సోమవారం జరిగింది. జూబ్లీహిల్స్ లోని తనింట్లోనే రామోజీని సీఐడీ ఉన్నతాధికారులు ఎనిమిదిగంటలపాటు విచారించారు.





విచారణ నుండి తప్పించుకునేందుకు రామోజీ చివరివరకు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. అందుకనే అనారోగ్యం పేరుతో మంచం మీద పడుకునే రామోజీ విచారణకు హాజరయ్యారు. 87 ఏళ్ళ రామోజీని సీఐడీ ఎనిమిది గంటలు విచారించటమంటే మామూలు విషయంకాదు. అందుకనే ఏ క్షణాన ఏమవుతుందో అని సీఐడీ తమవెంట డాక్టర్లు బృందాన్ని కూడా ఉంచుకున్నది.





మార్గదర్శి అక్రమాలు, అవినీతికి సంబంధించి రామోజీపై సీఐడీ ఏడుకేసులు నమోదుచేసింది. ఇపుడు విచారించింది ఒక కేసులో మాత్రమే. అంటే ఇంకా ఆరుకేసుల్లో విచారణ జరగాల్సుంది.  ఇక్కడే మార్గదర్శి కేసులో రామోజీ విచారణ ఇంకా చాలా ఉందన్న విషయం అర్ధమవుతోంది. ఒక కేసులోనే ఎనిమిది గంటలపాటు సీఐడీ విచారించిందంటే మిగిలిన కేసుల్లో కూడా ఒక్కొక్క విచారణ ఎన్నేసి గంటలు జరుగుతుందో ఏమో. కేసులన్నీ ఏపీలోనే నమోదయ్యాయి కాబట్టి రామోజీ, శైలజలను తొందరలోనే ఏపీకి తీసుకెళ్ళి విచారించే అవకాశలున్నాయని సమాచారం. ఏపీకి వేదిక మారినతర్వాత విచారణే అంటారో లేకపోతే అరెస్టుల దాకా వెళుతుందో తెలీటంలేదు.





6వ తేదీన రామోజీ కోడలు శైలజను విచారించబోతోంది. మిగిలిన ఆరుకేసుల్లో రామోజీని ఎప్పుడెప్పుడు విచారిస్తారనే విషయం సస్పెన్సుగా ఉంది. సోమవారం జరిగిన విచారణలో రామోజీ సీఐడీకి పూర్తిగా సహకరించలేదంటున్నారు. సంస్ధ అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఫైళ్ళను రామోజీ ముందుంచి సీఐడీ చాలా ప్రశ్నలే వేసి దేనికీ సమాధానం చెప్పలేదట. తాను అన్నింటికీ అతీతుడనని అనుకునే రామోజీ సీఐడీకి  సహకరించకపోవటంలో ఆశ్చర్యమేమీలేదు. విచారణ ఏపీకి మారితే రామోజీ వైఖరిలో మార్పొస్తుందేమో చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి: