నారా లోకేష్ కారణంగా చంద్రబాబునాయుడుపై తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోతోందా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే అనుకోవాలి. ఒత్తిడికి మూడు కారణాలున్నాయట. మొదటిదేమో పాదయాత్ర అనుకున్నంతగా సక్సెస్ కావటంలేదు. పాదయాత్రకు ముందు చంద్రబాబు, లోకేష్, తమ్ముళ్ళు చాలా అంచనాలు వేసుకున్నారు. అయితే వేసుకున్న అంచనాలకు వాస్తవానికి చాలా తేడా కనబడుతోందని సమాచారం. ఇక రెండో కారణం ఏమిటంటే లోకేష్ నోటికొచ్చింది మాట్లాడేస్తు అబాసుపాలవుతున్నారు. దాంతో అధికారపక్షం లోకేష్ మాట్లాడిన వీడియోలను వైరల్ చేస్తుండటమే ఉదాహరణ.





ఇక మూడో కారణం ఏమిటంటే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటిచేస్తుండటమే. లోకేష్ చేస్తున్న అభ్యర్ధుల ప్రకటనపై పార్టీలోనే కొన్నిచోట్ల  బాగా వ్యతిరేకత వచ్చేస్తోంది. అయినా లోకేష్ ఏమాత్రం వెనక్కు తగ్గటంలేదు. తాజాగా లోకేష్ చేసిన ప్రకటన చంద్రబాబుకు తలనొప్పులు మొదలైనట్లు తమ్ముళ్ళు చెప్పారు. అదేమిటంటే అనంతపురం పర్యటనలో ఉన్న లోకేష్ రాప్తాడులో పరిటాల సునీత, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ కు టికెట్లు ప్రకటించారు. ఈ ప్రకటనే చంద్రబాబు మీద ఒత్తిడి పెంచేస్తోందట.





రాబోయే ఎన్నికల్లో నో ఫ్యామిలి ప్యాకేజ్ అని చంద్రబాబు చాలామంది సీనియర్లకు స్పష్టంచేస్తున్నారు. తమతో పాటు తమ కొడుకులు, కూతుర్లకు టికెట్లు కావాలని సీనియర్ తమ్ముళ్ళు అశోక్ గజపతిరాజు,  చింతకాయల అయ్యన్నపాత్రుడు, జేసీ బ్రదర్స్, కేఈ, జ్యోతుల, బండారు ఫ్యామిలీల నుండి చాలాకాలంగా ఒత్తిళ్ళు వస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం సాధ్యంకాదని గట్టిగానే చెప్పేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే తల్లీ, కొడుకులు సునీత, శ్రీరామ్ కు లోకేష్ టికెట్లు ప్రకటించటం సమస్యగా మారింది.





ఒకవైపు ఫ్యామిలీ ప్యాకేజీ లేదని చంద్రబాబు చెబుతుంటే మరో వైపు లోకేష్ ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ప్రకటించటం ఆశ్చర్యంగా ఉంది. పరిటాల ఫ్యామిలీని చూపించి సీనియర్లు మళ్ళీ చంద్రబాబుపై ఒత్తిళ్ళు పెంచుతున్నారట. లోకేష్ కారణంగా ఇపుడు వీళ్ళందరికీ ఎలా సర్దిచెప్పాలో చంద్రబాబుకు అర్ధంకావటంలేదని సమాచారం. ధర్మవరంలో మాజీ ఎంఎల్ఏ, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకడైన బీజేపీ నేత వరదాపురం సూరి తొందరలోనే టీడీపీలో చేరి మళ్ళీ పోటీచేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటపుడు శ్రీరామే అభ్యర్ధి ప్రకటించేయటం చాలా వివాదాలను కెలికినట్లయ్యింది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: