కల్వకుంట్ల కవిత విచారణలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడుసార్లు విచారణలో చేయలేని పనిని సుఖేష్ చంద్రశేఖర్ చాలా తేలిగ్గా ఒకేదెబ్బకు చేసేశాడా ? ఇపుడిదే అంశం జనాల్లో నానుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై ఈడీ కవితను మూడుసార్లు విచారించిన విషయం తెలిసిందే. విచారణలో కవితను ఏమి ప్రశ్నించారు ? ఎలాంటి వివరాలు రాబట్టుకున్నారు ? అనే విషయాలు ఏవీ బయటకు తెలియలేదు. స్కామ్ లో కవితే సూత్రదారని కోర్టులో ఈడీ దాఖలుచేసిన చార్జిషీట్లలో చాలాసార్లే చెప్పింది.





అయితే విచారణలో ఏమైందో ఏమో ఇపుడు కవిత జోలికి ఈడీ వెళ్ళటంలేదు. అయితే లిక్కర్ స్కామ్ లో పరోక్ష సంబంధాలున్న సుఖేష్ మాత్రం కవితను గట్టిగా ఇరికించేశాడు. స్కామ్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్ తో పాటు కవిత పాత్ర కూడా కీలకమే అనేది ఈడీ అభియోగాలు. ఇందులో మనీష్, జైన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కవితను కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం బాగా జరిగింది. అయితే ఏమి జరిగిందో ఏమో ఇపుడు కవిత ప్రస్తావనను ఈడీ తేవటంలేదు.





అయితే స్కామ్ లో డబ్బును హవాలా మార్గంలో ఇతర ప్రాంతాలకు మళ్ళించాడని సుఖేష్ పైన ఆరోపణలున్నాయి. అలాంటి సుఖేష్ బుధవారం తన వాట్సప్ చాట్లను రిలీజ్ చేశాడు. అందులో కేజ్రీవాల్, మనీష్, సత్యేంద్ర, కవితల తరపున భారీ ఎత్తున డబ్బును హవాలా మార్గంలో తరలించినట్లుంది. రు. 15 కోట్లను హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఆఫీసులో అందించినట్లు కూడా చెప్పాడు.





అంతేకాకుండా తనకు కవితకు మధ్య డబ్బుల విషయంలో జరిగిన చాట్ ను కూడా రిలీజ్ చేశాడు. దాంతో స్కామ్ లో కవిత పాత్ర ఉందనే ప్రచారం బాగా పెరిగిపోయింది. కవితతో జరిగిన  చాట్ రిలీజ్ చేయటం ద్వారా ఈడీ పనిని సుఖేష్ సులభంచేశాడనే భావించాలి. తాజా చాట్ నేపధ్యంలో ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఆసక్తి సర్వత్రా పెరిగిపోతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: