జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎల్లోమీడియా రాతలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. జగన్ కు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు రాయటమంటే చాలు ఎక్కడెక్కడి విషయంలను పోగేసి పరిచేస్తుంది. ఇపుడిదంతా ఎందుకంటే సోమవారం ‘ప్లీజ్...ఏదో ఒకటి చేయండి’ అనే హెడ్డింగ్ తో పే...ద్ద కథనాన్ని అచ్చేసింది. ఇందులో కంటెంట్ ఏమిటంటే వివేకానండరెడ్డి హత్యకేసులో అరెస్టు కాకుండా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎలాగైనా కాపాడాలని బెంగుళూరుకు చెందిన ఒక జ్యోతిష్కుడిని జగన్ సంప్రదించారట.





విజయకుమార్ అనే జ్యోతిష్కుడిని బెంగుళూరు నుండి తాడేపల్లికి పిలిపించుకుని మాట్లాడారట. విజయ్ కుమార్ ఎవరంటే జ్యోతిష్కుడు కమ్ లాబీయిస్టని ఎల్లోమీడియా రాసింది. రాజకీయ, అధికార, న్యాయ వ్యవస్ధల్లో సదరు జ్యోతిష్కుడికి చాలా పట్టుందని కూడా చెప్పింది. ఇక్కడే ఎల్లోమీడియా రాతలపైన అనుమానం పెరిగిపోతోంది. అదేమిటంటే ఇంతకాలం అవినాష్ రెడ్డిని  విచారణకు రమ్మని సీబీఐ నోటీసులు ఇచ్చినపుడల్లా వెంటనే జగన్ ఢిల్లీకి వెళుతున్నారని రాసింది. ఇపుడేమో లాబీయిస్టన్నది.





అవినాష్ జోలికి సీబీఐ రాకుండా ఉండేందుకని నరేంద్రమోడీని జగన్ బతిమలాడుకుంటున్నారని గోలగోల చేసింది. మరిపుడేమో జ్యోతిష్కుడిని జగన్ రంగంలోకి దింపినట్లు రాసింది. రెండు కథనాలను ఎల్లోమీడియానే ఇచ్చింది. మరి రెండింటిలో ఏది కరెక్టు ? మళ్ళీ మంగళవారమేమో మోడీ, అమిత్ షా అసలు జగన్ కు అపాయిట్మెంటే ఇవ్వలేదని రాసింది. మోడీని జగన్ బతిమలాడుకున్నదే నిజమైతే ఎంపీ తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టుచేసే అవకాశం లేదుకదా. అలాగే ఎంపీ జోలికి సీబీఐ అసలు రాకూడదు. కానీ భాస్కర్ అరెస్టయ్యారు, అవినాష్ ను కూడా అరెస్టు చేసే అవకాశముందని సీబీఐ కోర్టుకే చెప్పింది.





కాబట్టి అరెస్టుల విషయంలో మోడీని జగన్ బతిమలాడుకున్నది అబద్ధమని తేలిపోయింది. ఇక జ్యోతిష్కుడి విషయం చూస్తే ఒక జ్యోతిష్కుడి ముందు న్యాయ, అధికార వ్యవస్ధలు సాగిలపడతాయా ? అనే సందేహం పెరిగిపోతోంది. ఇదే నిజమైతే నాలుగేళ్ళ కిందటే జగన్ సదరు జ్యోతిష్కుడితో మాట్లాడేవారే కదా. అన్నీ వ్యవస్ధలను మ్యానేజ్ చేసేంత సామర్ధ్యం ఉన్న జ్యోతిష్కుడు బెంగుళూరులో ఉన్నాడన్న విషయం జగన్ కు తెలీకపోయిందా ?  వాటే పిటి. మొత్తానికి ఎల్లోమీడియా మాత్రం మోడీ వైపునుండి జ్యోతిష్కుడి వైపుకు యూటర్న్ తీసుకున్నట్లు అర్ధమైపోతోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: