గుడివాడ నియోజకవర్గంలో గెలవటం అన్నది చంద్రబాబునాయుడుకు బాగా ప్రిస్టేజ్ అయిపోయింది. రెండు వరుస ఎన్నికల్లో కొడాలి నాని చేతిలో టీడీపీ అభ్యర్ధులు ఓడిపోయారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కొడాలిని ఎలాగైనా ఓడించాలన్నది చంద్రబాబు పట్టుదల. అయితే కొడాలిని బలంగా ఢీకొనేంత సీనున్న నేతలైతే పార్టీలో కనబడటంలేదు. అందుకనే టికెట్ కోసం ఎప్పటికప్పుడు ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము, సీనియర్ నేత రావి వెంకటేశ్వర్రావు లాంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.





ఈ నేపధ్యంలోనే తాజాగా మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. మీడియా, సోషల్ మీడియాలో ఈ పేరు బాగా వినబడుతోంది. ఇంతకీ ఆ పేరు ఎవరిది అంటే అలేఖ్యారెడ్డట. అలేఖ్యారెడ్డి అంటే ఈమధ్యనే చనిపోయిన నందమూరి తారకరత్న భార్య. వచ్చేఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడలో కానీ లేకపోతే ఏదో ఒక నియోజకవర్గంలో పోటీచేయాలని తారకరత్న రెడీ అయ్యారు. ఇదే విషయాన్ని తారకరత్న చెబితే చంద్రబాబు ఏమీ స్పందించలేదు.





అయితే ఆ తర్వాత తారకరత్న హఠాత్తుగా చనిపోవటంతో అతనిపై తనకు చాలా ప్రేమున్నట్లుగా చంద్రబాబు చెప్పుకున్నారు. అలాంటిది ఇపుడు అలేఖ్యా పేరు సడెన్ గా ప్రచారంలోకి వచ్చింది. తారకరత్న మేనమామ, చంద్రబాబు వియ్యంకుడు కమ్ బావమరిది నందమూరి బాలకృష్ణే ఈ పేరును సూచించారని చెప్పారట. అలేఖ్య అయితే కొడాలిపైన సెంటిమెంటుతో ఈజీగా గెలుస్తుందని చంద్రబాబుకు చెప్పారట. దాంతో చంద్రబాబు కూడా సానుకూలంగానే ఉన్నట్లు ప్రచారం పెరిగిపోతోంది.





అంతా బాగానే ఉంది కానీ మరి ఇంతకాలం పార్టీ కోసం కష్టపడిన నేతలు, లక్షలు దారపోసిన వాళ్ళంతా ఏమైపోవాలి ? సడెన్ గా అలేఖ్యను పోటీలోకి దింపేస్తే సెంటిమెంటుతో గెలిచిపోతుందా ? ఏడాది తర్వాత జరగబయే ఎన్నికల్లో తారకరత్న మృతి తాలూకు సెంటిమెంటు ఉంటుందా ? అసలు తారకరత్నే ఫెయిల్డ్ ఆర్టిస్ట్. రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. పైగా బతికున్నపుడు తారకరత్నను ఎన్టీయార్ కుటుంబమంతా వెలేసినట్లుగా చూసిన విషయం అందరికీ తెలిసిందే. కష్టాల్లో ఉన్నా తమను ఎవరు ఆదుకోలేదని స్వయంగా తారకరత్నే చెప్పుకున్నారు.  అలాంటిది అలేఖ్యకు టికెట్ ఇచ్చేస్తే గెలిచేస్తుందా ? డౌటే.




మరింత సమాచారం తెలుసుకోండి: