చంద్రబాబునాయుడును క్రెడిట్ కక్కుర్తి వదిలేలా లేదు. ఎక్కడ పాజిటివ్ డెవలప్మెంట్ జరిగిందని అనుకున్నా వెంటనే తనవల్లే జరిగిందనేస్తారు. ఇపుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రు. 2 వేల నోట్లను రద్దుచేసింది. వెంటనే చంద్రబాబు సీన్లోకి ఎంటరైపోయారు. తానిచ్చిన నివేదిక వల్లే ఆర్బీఐ పెద్దనోట్లను రద్దు చేసిందనే అర్ధం వచ్చేట్లుగా చెప్పేశారు. దీన్ని క్రెడిట్ క్లైమ్ సిండ్రోమ్ అని అంటారని నిపుణులు సరదాగా అంటున్నారు.

ఇంతకీ చంద్రబాబు చెప్పేదేమిటంటే డిజిటల్ కరెన్సీని చెలామణిలోకి తీసుకురావాల్సిన అవసరంపై నరేంద్రమోడీకి తానే నివేదిక ఇచ్చారట. బ్లాక్ మనీని అరికట్టాలన్నా, ఎన్నికల్లో ధనప్రభావాన్ని తగ్గించాలన్నా వెంటనే పెద్దనోట్లను రద్దుచేయాలని తానే సూచించినట్లు చెప్పారు. నిజానికి ఆర్బీఐ పెద్దనోట్లను రద్దుచేస్తున్న సమాచారం కూడా చంద్రబాబు దగ్గర ఉండుండదు. టీవీల్లో ఆ వార్త చూడగానే వెంటనే క్రెడిట్ క్లైం చేసేసుకున్నారు. డిజిటల్ కరెన్సీ గురించి చాలామంది నిపుణులు ఎప్పటినుండో చెబుతున్నారు.

కరోనా వైరస్ కారణంగానే మనదేశంలో డిజిటల్ కరెన్సీ మ్యాగ్జిమమ్ చెలామణిలోకి వచ్చింది. ఇపుడు పేటిఎం, జీపే, ఫోన్ పే లాంటివి సామాన్యులకు కూడా బాగా అలవాటైపోయింది. ఇక బ్లాక్ మనీని అరికట్టడం అంటే సాధ్యంకాదు. ఎందుకంటే ముందు రాజకీయనేతల దగ్గరే బ్లాక్ మనీ వేల కోట్లరూపాయలున్నాయనే ఆరోపణలు తెలిసిందే. ఇక ఎన్నికల్లో ధన ప్రభావం అంటే తెలుగురాష్ట్రాల్లో అది మొదలైందే చంద్రబాబుతో. 1996 పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్ధులను గెలిపించుకునేందుకు చంద్రబాబు ఓటుకు రు. 500 నోట్లు పంచారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ఏడేళ్ళక్రితం అంటే 2016లో రు. వెయ్యి నోట్లను రద్దుచేసినపుడు కూడా తానిచ్చిన నివేదిక ఆధారంగానే పెద్దనోట్లను రద్దుచేశారని చంద్రబాబు చెప్పుకున్నారు. అయితే వెంటనే నరేంద్రమోడీ రు. 2 వేల నోట్లను తీసుకురావటంతో చంద్రబాబుకు షాక్ కొట్టినట్లయ్యింది. దాంతో పెద్దనోట్ల రద్దుకు సంబంధించి మళ్ళీ ఎక్కడా మాట్లాడలేదు. ఇలా ఎక్కడ మంచి జరిగిందని అనుకున్నా వెంటనే అది నేనే..ఇది నేనే అన్న పాటలో లాగే అది నావల్లే ఇది నావల్లే అంటు మీడియా ముందుకు వచ్చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: