జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లేయటం అంటే ఎల్లోమీడియాకు చాలా ఇష్టం. విషయం ఏదైనా సరే మోకాలికి బోడిగుండుకు ముడేసి దాన్ని జగన్ చుట్టూ తిప్పేయటమే టార్గెట్ గా పెట్టుకున్నది. ఇందుకు తాజా ఉదాహరణ ఏమిటంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబం వ్యక్తి అయిన వైఎస్ షర్మిలను కాంగ్రెస్ తరపున రంగంలోకి దింపుతున్నట్లు రాశారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను జగన్ కు వ్యతిరేకంగా రంగంలోకి దింపబోతున్నారట.





ఇంతవరకు రాసి ఊరుకుంటే అది ఎల్లోమీడియా ఎందుకవుతుంది. జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎవరినైనా దించచ్చు అందులో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరంలేదు. అయితే కాంగ్రెస్ ప్రస్తుత దుస్ధితికి జగనే కారణమని రాయటమే ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర విభజన దెబ్బకు  ఏపీలో కాంగ్రెస్ భూస్ధాపితమైపోయింది. రెండు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను పట్టించుకున్న ఓటర్లే లేరనటం అతిశయోక్తికాదు. ఏదేదో ఊహించేసుకుని కొందరు నేతల చెప్పుడుమాటలు నమ్మిన సోనియాగాంధి సమైక్యరాష్ట్రాన్ని రెండుగా విభజించారు.





పచ్చగా కళకళలాడుతున్న కాంగ్రెస్ పార్టీ విభజన దెబ్బకు నాశనమైపోయింది. రాష్ట్ర విభజన జరిగితే రెండురాష్ట్రాల్లోను కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న కొందరి మాటలను సోనియా నమ్మింది. చివరకు ఏమైంది ? తెలంగాణాలోను అధికారంలోకి రాలేదు. ఏపీలో అయితే ఏకంగా భూస్ధాపితమే అయిపోయింది. ఆ దెబ్బకు పదేళ్ళవుతున్నా కాంగ్రెస్ ఏపీలో కోలుకోనేలేదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. ఇందులో జగన్ చేసిందేముంది ? కాంగ్రెస్ సమాధికి స్వయంగా సోనియాగాంధీనే గొయ్యితవ్వేశారు.





ఇందులో కాంగ్రెస్ దుస్ధితికి జగన్ ఏ విధంగా కారణమవుతారో ఎల్లోమీడియానే చెప్పాలి.  విచిత్రం ఏమిటంటే ఏపీలో కాంగ్రెస్ ప్రస్తుత దుస్ధితికి జగనే కారణమని హస్తపార్టీ నేతలు కూడా ఒక్కసారి కూడా అనలేదు. అలాంటిది కాంగ్రెస్ దుస్ధితికి జగనే కారణమని ఎల్లోమీడియా చెప్పటం అంటే కేవలం బురదచల్లటం తప్ప మరోటికాదు. జగన్ను  బలహీనపరచటమే కాంగ్రెస్ టార్గెట్ అని ఎల్లోమీడియా చెప్పింది. జగన్ను కాంగ్రెస్ ఏ విధంగా బలహీనపరచగలదు ? కేంద్రంలో అధికారంలో ఉంటేకానీ అది సాధ్యంకాదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి సంగతి కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: