రాజధాని అమరావతి ప్రాంత భూ వ్యవహారాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. ఫలానా చోట రాజధాని పెట్టుబోతున్న విషయం బహిరంగంగా ప్రకటించక ముందే ఆ ప్రాంతంలో టీడీపీ నేతలు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ వ్యవహారాలకు సంబంధించి పలువురిపై ఏసీబీ తాజాగా కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తమ పార్టీ ఈ ఆరోపణలు చేసిందని, ఇప్పటికీ వాటికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.