లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమాచారం ప్రకారం పార్లమెంట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ విషయంపైన గత శనివారం కేంద్ర ప్రభుత్వం సమావేశంలోనూ ప్రతిపక్షాలతో చర్చించింది. ఇటీవల సమావేశాలకు హాజరైన ముగ్గురు ఎంపీలకు కరోనా వైరస్ రావడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.కరోనా భయాల మధ్య ఉభయ సభల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.