విశాఖపట్నంలోని గాజువాకలో ఎస్ఎఫ్ఎస్ పాఠశాలకు పక్కనే చాలా గోప్యంగా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు. కొందరి ఇచ్చిన పక్కా సమాచారంతో వ్యభిచార గృహంపై దాడులు జరిపారు టాస్క్ ఫోర్స్ పోలీసులు..ఈ దాడిలో కొందరి యువతులను, విటులను మరియు దీని నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వీరు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ గుట్టుగా వ్యభిచారం చేయిస్తున్నారు.