పత్తికొండ మండలం పందికోనలో శుక్రవారం జరిగిన అవమానవీయ ఘటన సభ్యసమాజం తలదించుకొనేలా ఉంది.వైకాపా కార్యకర్త గోమారీ కాశీ ఇంటెదురుగా నివాసం ఉంటున్న చిన్నారి పై అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.