ఎన్నికల లెక్కింపు మొదలవు తుండగా మరో వైపు ఆటంకం కలిగించే విధంగా ఏర్పాట్లు చేయరాదని ఎన్నికల కమీషన్ ఆదేశించింది..పోలీసులు కూడా ఈ విషయం పై దృష్టి పెట్టారు.ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రేటర్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 4వ తేదీ ఉదయం 6గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6గంటల వరకు నిషేదాజ్ఞలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.