ఎలక్ట్రీషియన్లా రెడీ అయ్యి.. జేబులో టెస్టర్ పెట్టుకుని నీట్గా బయటకు వస్తాడు. విలాసవంతమైన అపార్టుమెంట్లు, విల్లాలనే టార్గెట్ చేసుకుంటాడు. తాళాలు వేసిన ఇళ్ళల్లో చోరీలకు వెళ్తాడు..తాళాలను పగలగొట్టి ఇంట్లో దొరికిన కాడికి దోచుకు పోతాడు..ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు మాత్రమే చోరీలు చేస్తాడు. 5 దాటితే ఆఫీస్ నుంచి వెళ్లిపోతున్నట్లు ఇంటికి చేరతాడు. అలా ఓ రోజు పోలీసులకు చిక్కాడు..