వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. కృష్ణా జిల్లా పరిటాలో నిర్వహించిన భోగి వేడుకల్లో బాబు పాల్గొన్నారు.ఈ మేరకు ఆయన జగన్ పై ఆరోపణలు చేశారు. జగన్ తీసుకొచ్చిన రైతులకు వ్యతిరేఖ జీవోలను ఐదింటిని తీసుకొచ్చి భోగి మంటల్లో వేశారు.పాదయాత్ర అన్నాడు చేతికి దొరికి వారికి ముద్దులు పెట్టి గారాబం చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పి దారుణంగా మోసం చేశారు. ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నాడని విమర్శించారు.