ఢిల్లీ లో మాత్రం టీకా వేయించుకున్న వారిలో కొందరు అస్వస్థతకు గురయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా 1.91 లక్షల మందికిపైగా ఆరోగ్య రంగానికి చెందిన వారికి కరోనా టీకా వేశారు. అయితే ఢిల్లీలోని ఎన్డీఎంసీకి చెందిన చారక్ పాలికా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు అనంతరం తేలికపాటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఛాతిలో తేలికపాటి బిగుతుకు గురయ్యారు. దీంతో వారిద్దరిని కొంత సేపు వైద్యుల బృందం పరిశీలనలో ఉంచారు.అర గంట తర్వాత వారి ఆరోగ్యం మెరుగు పడటం తో డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తుంది.