ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామాల్లో ఇంటర్నెట్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.. సొంత ఊళ్లల్లోనే వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించాలన్నారు.ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్షన్, అమ్మ ఒడి కింద ల్యాప్టాప్ల పంపిణీపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఇంటర్ నెట్ సేవలను మరింత మెరుగ్గా అందించాలని అధికారులకు సూచించారు.