మరోసారి చికెన్ ధరలు ఢమాల్.. హైదరాబాద్ లో రేట్లు మరోసారి కిందకు దిగి వచ్చాయి..నెల రోజులక్రిం కిలో చికెన్ ధర 220 రూపాయలు కాగా ప్రస్తుతం కిలో 140 నుంచి 150 రూపాయలకు పడిపోయింది. అలాగే ఫామ్ల వద్ద ఒక్కో కోడి ధర 60 నుంచి 70రూపాయలకు పడిపోయింది. జాతీయ ఆహార సంస్ధ తాజాగా కొన్ని నిబంధనలు విడుదల చేసింది. ఇందులో చికెన్ వినియోగించడం వల్ల బర్డ్ఫ్లూ రాదని స్పష్టంచేసింది. అయితే మాంసాన్ని బాగా ఉడిగికించి తినాలని, కోడిగుడ్లను హాఫ్ బాయిల్డ్ తినకూడదని నిబంధనల్లో స్పష్టంచేసింది..