తమిళనాడు రాజధాని చెన్నైలోని తిరువోట్టియూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తజంగ్కుప్పంలో నివాసం ఉండే 32 ఏండ్ల జయకుమార్ అనే వడ్రంగి ఈ నెల 12న తల్లిదండ్రులను చూసేందుకు తిరువోట్టియూర్కు వచ్చాడు. అక్కడ మద్యం సేవించిన అతడు రాత్రి కావడంతో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి షార్ట్‌కట్‌లో ఇంటికి బయలుదేరాడు. ఆసుపత్రి ప్రాంగణంలో ఒంటరిగా నిద్రిస్తున్న ఒక వృద్ధురాలిని చూశాడు. మద్యం సేవించిన జయకుమార్ కామంతో ఆ వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె అరవడంతో బండరాయితో కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధురాలు చికిత్స పొందుతూ చనిపోయింది.