ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. హిజ్రాల్లో కొంతమందినైనా మార్చగలిగితే నేరాలు నియంత్రణలోకి వస్తాయని సైబరాబాద్ పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ' ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్'ను పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించనున్నారు..ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో తరచూ జరుగుతున్న ఘర్షణలు, రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడంతో పాటు హిజ్రాలను ఎవరైనా వేధించిన సందర్భంలో పోలీసుల నుంచి సహాయం కోసం ఈ హెల్ప్‌డెస్క్ మార్గదర్శనం చేయనుంది.