బాలికలకు చాక్లెట్లు ఇచ్చి వారికి అశ్లీల వీడియోలు చూపిస్తున్న 68 ఏండ్ల వృద్ధుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 12 ఏండ్ల బాలిక తల్లి వృద్ధుల సంరక్షకురాలిగా పనిచేస్తున్నారు. ఎన్నోర్కు చెందిన నిందితుడు పుష్పరాజ్ బాలికకు గేమ్స్ ఆడుకోమని తన సెల్‌ఫోన్ ఇస్తుండేవాడు. ఆ నేపథ్యంలో అశ్లీల వీడియోలను చూసేలా బాధితురాలిని ప్రేరేపించి ఆపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. బాలిక ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె నిందితుడు పుష్పరాజ్‌ను నిలదీశారు. నిందితుడు తన మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియోలను స్టోర్ చేసినట్టు ఆమె గుర్తించారు..