ముంబైలోని కేంద్రీయ విద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ టీచర్ దినేశ్ పటేల్, 47 భాషలు మాట్లాడే హ్యూమనాయిడ్ రోబోట్‌ను అభివృద్ధి చేశారు. దీనికి 'షాలు' అని పేరు పెట్టారు. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, భోజ్‌పురి, బెంగాళీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, మలయాళం ప్రాంతీయ భాషలతో పాటు 39 విదేశీ భాషల్లో ఇది అనర్గళంగా మాట్లాడుతుంది. మహిళా రూపంలో ఉన్న ఈ హ్యూమనాయిడ్ ఆడవారి గొంతుకతో మాట్లాడుతుంది. 'షాలు' అందరినీ పలుకరించడంతోపాటు భావోద్వేగాలను కూడా వ్యక్తం చేస్తుంది..