దేశ ప్రధాని కావడం అంటే చిన్న విషయమేమీ కాదు, కోట్లాది ప్రజలకు మార్గదర్శిగా మారి పాలన సాగించాల్సి ఉంటుంది. ప్రజల నాడి సరిగ్గా పట్టుకున్న నాయకుడే ఎక్కువ కాలం సింహాసనంపై పాలన సాగించగలరు అన్నది అక్షర సత్యం. లేదంటే ఓటు వేసి గెలిపించిన అదే ప్రజలు తదుపరి ఎలక్షన్ సమయంలో గద్దె దించేందుకు ఏమాత్రం వెనుకాడరు.