- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుల మార్పు నేపథ్యంలో కీలకమైన దశకు చేరుకుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను ఆధారంగా చేసుకుని గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన జగన్, ఇప్పుడు ఆ వ్యూహాన్ని పునఃసమీక్షించాల్సిన పరిస్థితి వ‌చ్చేసింది. గత ఐదేళ్ల పాలన కాలంలో ఎక్కడ మాట్లాడినా “ నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ ” అంటూ ప్రసంగాల్లో పదే పదే ఈ వర్గాలే తమ వెన్నెముక అని చెబుతూ వచ్చిన జగన్, ఇప్పుడు మారుతున్న రాజకీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా త‌న వ్యూహం మార్చుకున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ పీఏసీ స‌మావేశంలోనూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని నొక్కిచెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఎస్సీ , ఎస్టీ , మైనారిటీలను ప్రధానంగా నమ్ముకున్నామని, కానీ ఇతర సామాజిక వర్గాలు దూరంగా వెళ్లాయని జ‌గ‌న్‌ అంగీకరించార‌ని టాక్ ? అందుకే ఈ సారి పార్టీ ప‌ట్ల కమ్మ, కాపు వర్గాల్లో ఏర్పడిన వ్యతిరేకత పార్టీకి ఎంత నష్టం చేకూర్చిందో జ‌గ‌న్‌కు స్పష్టంగా అర్థమైందని చెప్పాలి.


జగన్ గతంలో చేసిన ప్రకటనలు, నడిచిన విధానం చూస్తే కొన్ని వర్గాలపైనే పూర్తి దృష్టి సారించడంతో మిగిలిన సామాజిక వర్గాలు దూర‌మ‌య్యాయి. మ‌రీ ముఖ్యంగా మధ్య తరగతి, వృత్తి ఆధారిత వర్గాలు, రైతులు, ఉద్యోగుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు మాత్రమే పరిమితమయ్యాయి, కానీ సామాన్య ప్రజలు ఎదుర్కొన్న పరిపాలనా లోపాలపై సరైన స్పందన లేకపోవడం పార్టీకి ఎన్నిక‌ల్లో పెద్ద మైన‌స్ అయ్యింది. ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు ఇతర సామాజిక వర్గాలను కూడా ఆకర్షించాలనే దిశగా వ్యూహ మార్పు చేస్తున్నారు. ఇక‌పై అన్ని వర్గాలకు సమానంగా ప్రాతినిధ్యం కల్పిస్తూ ముందుకు సాగాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇది పార్టీకి భవిష్యత్తులో ఓటు బ్యాంకు విస్తరణకు ప్ల‌స్ కానుంది. అయితే వాస్తవంగా ఆ మార్పు జగన్ మాటలకే పరిమితమవుతుందా లేక కార్యాచరణలోనూ కనిపిస్తుందా అన్నదే ప్రధాన ప్రశ్న.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: