ఆగస్టు నెల అంటేనే రాజకీయనాయకులు బెంబేలెత్తుతారు. ఎందుకంటే ఈనెల రాజకీయ సంక్షోభాలకు మారుపేరు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆగస్టు ఆయన్నీ ముప్పుతిప్పలు పెట్టింది. ఎన్టీ రామారావును నాదేళ్ల భాస్కరరావు నుండి వెన్నుపోటు పొడిచారు. సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను గద్దె దింపి పార్టీని తన హస్తగతం చేసుకోవడం కూడా ఈనెలలోనే జరిగింది. మరి వచ్చే ఆగస్టు ఎలావుండ బోతోందో కొంచెం తెలుసుకుందాం.... ఈ ఆగస్టు 8 నుండి 18 వరకు రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని జ్యోతిశాస్త్రపండితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి మారుతారని కూడా ఘంటాపథంగా చెబుతున్నారు. కిరణ్ కుమార్ కు గత సంవత్సరం శని ఉచ్చధశలో ఉన్నందున ఎవరూ ఊహించని విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారని, ఈ సంవత్సరం కిరణ్ కు జాతకంలో శని వక్రదశలో కన్యను చూడటం వల్ల ఆయనకు పదవీ గండం తప్పదని ఆయనకు ఆగస్టు అంతా క్షణం ఒక యుగంలా గడుస్తుందని కూడా చెబుతున్నారు. అలాగే ఆగస్టు 15న కుజ శని కలయిక వల్ల కూడా రాష్ట్రరాజకీయాలలో పెనుమార్పు ఉంటాయన్నారు. అయితే ఈ మార్పులన్నీ రాష్ట్రానికి మంచిదే అని కూడా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించే వారికి గుడ్ లక్ చెప్పడం విశేషం గతంలో రోశయ్య కూడా రాజీనామా చేయడానికి కొద్దిరోజుల ముందు విలేఖరులడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ‘‘ నన్నే చేయమంటారు పదవికి రాజీనామ చేయమంటారా?’’ అని ఆగ్రహంతో అన్నారు. తదాస్తు దేవతలు తధాస్తు అన్నారో ఏమోగాని కొద్ది రోజులకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కిరణ్ కుమార్ తన పదవిపై కన్నేసిన వారికి గుడ్ లక్ చెప్పడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: