స్వతంత్ర్యం వచ్చాక మొదటి తరం రాజకీయాలన్నా, నాయకులన్నా, మంత్రులన్నా, ప్రజలకు గౌరవాభిమానాలు ఉండెవీ అందుకు కారణం వారు ప్రజలకు సేవచేయటానికే వచ్చారని నమ్మకం కలిగించటం, అందుకు నాయకులు, మంత్రులు పాటించిన నైతికతే నిదర్శనం, ఏదైనా ఒక ఆరోపణ వస్తే అదినిరూపించుకునే వరకు రాజీనామా చేసేవారు. అది వారి నిబద్దతకు నిదర్శనం... అనంతరం ఎన్ని ఆరోపణలు, స్కాంలు, కుంభకోణాలు ఏమైనా సరే పదవికి ఏమీ అడ్డుకాదనే నాయకులు ముందుకొచ్చారు. ఇప్పుడు మోడరన్ తరం వచ్చింది. సరికొత్త సాంప్రదాయం తెరపైకి తెచ్చారు. అవినీతి ఆరోపణలు, సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులకు వారి పదవులకు ఏమీ అడ్డంకి కాదు కావాలంటే న్యాయసహాయ్ కూడా వారి వారి శాఖలనుండి ఖర్చుపెడుతారు. ఎంత ఎదిగూపోయాం.. ఎదిగింది రాష్ట్ర ప్రజలు కాదు. రాష్ట్ర మంత్రి వర్గం, అదికూడా ఏ ఒకరికో ఇద్దరికోకాదు ఏకంగా నలుగురు మంత్రి వర్యులకు, అందులో ఇద్దరికి ముందు లేదన్నా, తరువాత వారికి కూడా అందిస్తామన్నారు.  ఇంత దిగజారుడు తనం ఏ రాష్ట్రంలోనైనా ఉందా. ప్రజలు మాత్రం కరెంటు లేని అంధకార రాష్ట్రంలో ఉండాల్సిందే. ఫంటలు వేయడానికి విత్తనాలు, ఎరువులు లేవు, బ్లాకులో తెచ్చివేసిన గింజలు మొలవవు, పోనీ మెట్ట పంటలు వేద్దామంటే వానలు పడవు. బోర్లుకింద పండిద్దామనుకుంటే కరెంటు లేదు, కానీ బిల్లులు మోత మాత్రం పెరిగిపోతుంది. పరిశ్రమలది అదే దారి, పంటలు పండక రైతులు, చాలీ చాలని సదుపాయాలతో కాలేజీ చదువులు, తల్లిదండ్రులకు పెను భారం. స్కాలర్ షిప్పుల ఊసేలేదు. రీఎంబర్స్మెంట్ వస్తుందోరాదో తెలియదు. బయటికి వెలితే ఇంటికి వస్తామో రాలేమో తెలియదు. ఎందుకంటే రహదారులన్నీ రక్తసిక్తం, చేనేత పరిశ్రమ పడక వేసింది. పట్టించుకునేవారే కరువు. రోగం వస్తే సర్కారు ధవాఖానాలో డాక్లర్లు ఉండరు. డాక్టర్లు ఉన్నా మందులుండవు. కార్పొరేట్ ఆసుపత్రుల కెలితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. పెరిగిన నిత్యావసర ధరలు చుక్కల్లో ఉన్నాయి.  అందుకోలేక సామన్యుడి అసహాయత.. ఇదేమీ ఇప్పటి పాలకులకు అవసరం లేని విషయాలు, వాటికి ఉన్నది ఒకటే ఎజెండా పదవి ఉందా లేదా ఎలా పదవిని పదికాలాల పాటు పదిలంగా కాపాడుకుందామా అనే., అనే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటానికి, లేదా వారి వారి పదువుల్ని కాపాడుకోవటానికే ఉదయం, సాయంత్రం దేశరాధాని తిరిగేది ప్రజాసమస్యలపై కాదు. వారు అక్కడనుండి ఒక్క పథకం గానీ ఒక్క పైసాగానీ ప్రజలకోసం తెచ్చింది లేదు. రాష్ట్ర ప్రజలకు ఆ ఆశకూడా లేదు కాని మంత్రుల అవినీతి ఆరోపణలకు న్యాయ సహాయం పేరిట ప్రజల డబ్బుని అంతగా దుర్వినియోగపరచడానికా మనం ఎన్నుకున్నది.  దేశంలో నాలుగో పెద్దరాష్ట్రం, అధిక జనాభాలో ఐదోవ రాష్ట్రం అన్నిటికంటే ముందు భారతదేశానికి ఆంధ్రరాష్ట్రం అన్నపూర్ణ దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రం. ఇదంతా గతం .. ఇక ముందంతా అంధకార రాష్ట్రంగానో లేదా అవినీతి ప్రభుత్వ రాష్ట్రంగానో మనల్నిమంనం పరిచయం చేసుకుందా.  ఇలాంటి నేతల్ని ఎన్నుకుంటే అంతే మరి....

మరింత సమాచారం తెలుసుకోండి: