తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు గాను తెలంగాణ ప్రజల్లో మరింత చైతన్య తెచ్చేందుకు భారతీయజనతాపార్టీ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే గ్రామస్థాయినుండి జిల్లా స్థాయివరకు తెలంగాణ ఉద్యమాన్ని బిజెపి ఆధ్వర్యంలో కొనసాగించడంకోసం సిద్దమైంది.
ఫిబ్రవరి 1నుండి తెలంగాణ ఉద్యమాన్ని బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలోని పల్లెపల్లెన ప్రాకనుంది. ఇప్పటికే తెలంగాణ ఉద్యమం తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నప్పటికిని బిజెపి ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టి రాజకీయంగా లబ్దిపొందేందుకు బిజెపి సిద్దపడుతుంది. గ్రామస్థాయినుండి మండలం,నియోజకవర్గం, జిల్లాస్థాయి వరకు కమిటీలు వేసి ఉద్యమాన్ని నడిపేందుకు బిజెపి సిద్దమైంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులు రావడంతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు లేవు. ఇటువంటి పరిస్థితిలో జాతీయపార్టీ అయినటువంటి బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇస్తుందనే ప్రచారంతో ముందుకు వెళ్లనుంది. కాగా భవిష్యత్తులో టిఆర్ఎస్, బిజెపి కల్సి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిలో బిజెపి కూడా తెలంగాణ కోసం తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాన్ని నడుపాలనుకుంటుంది. తెలంగాణ ప్రాంతంలో బిజెపి ఆధ్వర్యంలో బహిరంగ సభలను ఏర్పాటు చేసి బిజెపి జాతీయస్థాయి నాయకులను కూడా సభలకు రప్పించి తెలంగాణ ప్రజలకు తెలంగాణ విషయంలో ఖచ్చితమైన హామిని ఇప్పించేందుకు బిజెపి సిద్దమవుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: