హైదరాబాద్: శంషాబాద్ లోని అంతర్జాతీయ ఏయిర్ పోర్టు వద్ద పోలీసులు రెడ్ అలర్ట్ను ప్రకటించారు. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరుంచుకుని ముందస్తుగా పోలీసులు ఏయిర్ పోర్టు వద్ద భారీ భద్రతను కలిపించారు. హై అలర్ట్ను ప్రకటించిన దరిమిలా సీఐఎస్ఎఫ్ బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టారు. స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ఉగ్రవాదులు, తీవ్రవాదులు దేశంలోని ప్రధాన నగరాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఏమైనా దాడులకు పాల్పడవచ్చనీ కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించడంతో ముందస్తుగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలు విమానాశ్రయంలో అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ రెడ్ అలర్ట్ నెల రోజుల వరకు అమలులో ఉంటోంది. దీనితో ఏయిర్ పోర్టు లోకి విజిటర్ల అనుమతిని రద్దు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: