హైదరాబాద్: మహారాష్ర్టలోని పూణెలోని నాలుగు ప్రధాన స్థానాల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. కొద్ది సేపటి కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుళ్లతో పలువురు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. పూణె నగరంలోని జెఎం రోడ్డు, గార్వేర్ కళాశాల, డెక్కన్ రోడ్డు, గంధర్వ థియేటర్ వద్ద ఈ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం అందుతోంది. పేలుళ్లతో ప్రాణ నష్టమేమీ జరగలేదనీ, కాకపోతే పలువురు గాయాలపాలైనట్లు తెలుస్తోంది. తక్కువ సామర్థ్యం కలిగిన పేలుళ్ల వల్ల పలు వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం. పూణెలో వరుస పేలుళ్లు చోటుచేసుకోవడంతో పూణె పట్టణమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది.  ముంబాయి సంఘటన మరిచిపోకముందే పూణెలో ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుళ్లకు సంబంధించి బాంబ్ స్కాడ్ రంగంలోకి దిగింది. పేలుళ్లు ఎలా జరిగాయనే దానిపై విచారణ చేపట్టింది. ఇదిలా ఉంటే కేంద్ర హెం శాఖ మంత్రిగా మహారాష్ర్టకు చెందిన సుశీల్ కుమార్ షిండే పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే పూణెలో వరుస పేలుళ్లు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర హెంశాఖ మంత్రి షిండేకు సవాళ్లు విసిరినట్లేననీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: