రాష్ర్టంలో విస్తారమైన వర్షాలు కురుస్తుండటంతో వ్యాధులు సైతం పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లోని మన్యం ప్రాంతాలు మరణమృందంగాన్ని తలపిస్తున్నాయి. ఏజన్సీ ప్రాంతాల్లో ఎక్కడ చూసిన మలేరియా తఢాకా చూపుతోంది. మన్యం ప్రాంతాల్లో 2 వేలకు పైగా గ్రామాల్లో 3 లక్షల పైగా దోమతెరలను ప్రభుత్వం పంపిణీ చేసిందంటే ఈ మహమ్మరి ఏ విధంగా విజృంభించిందో ఊహించుకోవచ్చు. అంతేకాకుండా అంతుపట్టని విషజ్వరాలు సైతం మన్యం గిరిజన ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నాయి. అంటువ్యాధుల విజృంభణతో గ్రామీణ ఏజన్సీ ప్రజలు వణికిపోతున్నారు. రాష్ర్టంలో నైరుతి రుతుపవనాలు ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో వాతావరణంలో మార్పు, కలుషిత జలాలు, పారిశుద్ధ్యలేమి వంటి వాటితో రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. కాగా ఈ సీజన్లో ఏటా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిసినా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం నామమాత్రపు చర్యలతో సరిపెడుతోంది. ఉత్తరాంధ్ర, ఖమ్మం జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో పౌష్టికాహార లోపంతో రోగ నిరోధక శక్తి తక్కువై చిన్నపాటి వ్యాధులు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. మన్యంలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసిబ్బంది కొరత సైతం వ్యాధులు ప్రబలడానికి కారణమవుతోంది. రాష్ర్టంలోని 450 గిరిజన గ్రామాల్లో రక్షిత మంచినీటి సౌకర్యం లేకపోవడం, కలుషితమైన బావుల్లో నీటిని తాగాల్సి రావడం, దోమ తెరలు, దోమల మందు పిచికారి, 108, 104 సేవలు, సైతం అంతంత మాత్రంగా ఉండటంతో ప్రాణాంత వ్యాధులు ఊపిరితీస్తున్నాయి. ఇప్పటికైనా వైద్యశాఖ తమకు సౌకర్యాలను ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: