హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నాహజారే టీంపై కేంద్ర మంత్రి వాయిలార్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం దేశ రాజకీయాలను అస్థిరపరచడానికే అన్నాతో ఇతర ఆయన సహచరులు ప్రధానిపై పసలేని, అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారనీ వాయిలార్ రవి ఆదివారం హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. అన్నాహజారే తాజాగా ప్రధాని మన్మోహన్ సింగ్ పై కోల్ గేట్ కుంభకోణంపై మాట్లాడారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అయిన రవి ఘాటుగానే స్పందించారు. దేశ రాజకీయ వ్యవస్థను అస్థిరపరచడానికి అన్నా అనచరగణం చేస్తున్న కుట్రలకు అమెరికాలోని కొన్ని సంస్థలు సహాయం చేస్తున్నాయన్నారు. అన్నా టీంలో నీతిపరులెవరూ లేరన్నారు. ప్రధానిపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆరోపణలు మానుకోవాలన్నారు. ఇదిలా ఉంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మరణం వస్తున్న వార్తలపై తానేమీ మాట్లడనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు జగన్ వైపు వెళ్లినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చోటు చేసుకున్న చిన్న చిన్న లోపాలను తామందరమూ కూర్చోని సరిదిద్దుకుంటామని వాయిలార్ రవి అన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: