నైతికత...ఇది పదవుల్లో ఉన్న వ్యక్తులకే వర్తిస్తుందా, వ్యవస్థకు వర్తించదా ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. తప్పు రుజువుకాకపోయినా ఆరోపణలు వస్తే చాలు నైతిక భాద్యత వహించి పదవి నుంచి వైదొలగాలని గగ్గోలు పెడుతున్నారే తప్ప ఒక రాజ్యాంగ వ్యవస్థ తప్పుచేస్తే, అది రుజువైతే దానికి నైతిక భాద్యత వహించి దాని పాలకవర్గం అధికారం నుంచి ఎందుకు తప్పుకోకూడదు,దానిని ఎందుకు తప్పించవద్దు అన్నదే ఇప్పుడు అందరు ఆలోచింపచేస్తోంది. ఈప్రశ్న ఇప్పుడు ఎందుకు తలెత్తుదోందంటే ఒకరి తర్వాత ఒకరు మంత్రుల ఇలా ఇంటి బాట పడుతున్నారు.భాద్యత నా ఒక్కడిది కాదని, మంత్రివర్గం సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని భాదిత మంత్రులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజలకు నష్టం జరిగినట్లు, ప్రజాధనం వృధా అయినట్లుగా రుజువైంది. అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ దీనిని ఆధారాలతో సహా బయటపెట్టింది.కాగ్ తన నివేదికలో ఉదహరణలతో సహా వివరించింది. మంత్రి మోపిదేవిని మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారు,కేవలం ఏసిబి విచారణలో ఆయన ముడుపులు తీసుకున్నారని,ఇప్పడు పార్థసారథిని ఎందుకు పదవి నుంచి తొలగమంటున్నారు,ఫెరా కేసులో ఇరుక్కున్నారని,ఇంకొందరు మంత్రులు ఇదే వరుసలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. అలాంటప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 జీఓలను తీసి ప్రజాధనాన్ని తెగమింగి,ప్రజాప్రయోజనాలను దెబ్బతీసిన ప్రభుత్వాన్ని ఏం చేయాలి, దీని వల్ల భూములు,నివాసాలు,ఉపాదికోల్పోయి ఎందరో ఆత్మహత్యలు చేసుకుని తనువుచాలించారు. ఇవి సదరు ప్రభుత్వం చేసిన హత్యలు కావా. ఏ ఒక్కరి ప్రమేయంతోనో ప్రభుత్వ ఉత్తర్వు వెలుబడుతుందా...ఒక వేల అలా జరిగినా కూడా జీఓ జారిఅయిందంటే అది ప్రభుత్వం చేసినట్టే కదా. ఒక్కో జీఓను ఆధారం చేసుకుంటూ దానిమంత్రిని, ఆశాఖ కార్యదర్శిని నేరస్థులుగా చూపెడుతుండడం ఎంతవరకు సమంజసం, అత్యున్నత ప్రమాణాలున్న మన న్యాయవ్యవస్థకు ఇది తెలియదా ఇవన్నీ సమాధానాలున్న ప్రశ్నలే అయినా ఇప్పుడు మాత్రం జవాబులేనే ప్రశ్నలే. 

మరింత సమాచారం తెలుసుకోండి: