ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రమాదపుటంచుల్లోకి వెలుతోందా..? అంటే అవుననే అనిపిస్తోంది. ఆనాడు రజాకార్లను ఎదిరించడానికి జరిగిన తెలంగాణ సాయుధపోరాటాన్ని స్పూర్తిగా చూపెడుతూ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు అదొక్కటే మార్గమని తెలంగాణ యువతను ఆదిశగా మల్లిస్తున్న ఘటన వెలుగుచూసింది. ఇది పెద్దదయితే మాత్రం పెను ప్రమాదమే. ఆనాటి తెలంగాణసాయుధపోరాటం స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక మైలురాయి. కాని అది పరాయిపాలకులను పారద్రోలడానికి జరిగింది. కాని ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటుపేరుతో కొందరు ఇలాంటి సాయుధపోరాటానికి శ్రీకారం చుడుతున్నారు. ఇది చాలా ప్రమాదకర పరిణామం. సొంత పాలకులనే టార్గెట్ గా చేసుకొని ఈపోరాటం చేయనున్నట్లు తెలుస్తోంది.అంటే ప్రత్యేకం పేరుతో మరో విప్లవగ్రూపు ఏర్పడుతోందన్న మాట. ఇది పెరిగితే తెలంగాణలో ప్రజాప్రతినిధులు తిరగలేని పరిస్థితులు నెలకొంటాయి. అయితే ఇది రూపుదిద్దుకుంటున్న విషయం స్వాతంత్ర్యదినోత్సవ సంబరాలు జరుపుకోవడానికి ఒకరోజు ముందే ఆదిలాబాద్ లో వెలుగుచూసింది.ఉస్మానియా విశ్వవిధ్యాలయంలో లా మూడోసంవత్సరం చదువుతున్న విధ్యార్థి శ్రీశైలం ఈసాయుధపోరాటంలో యువకులను చేర్చుకుంటూ ఆయుధాలతో సహా పోలీసులకు పట్టుబడ్డారు. ఈపోరాటంలో చేరేందుకు ఆయన వద్దకు వచ్చిన మడావిక్రిష్ణ,శంకర్ అనే ఇద్దరు గిరిజన యువకులు కూడా దొరికిపోయారు. దీంతో సాయుధపోరాటం పేరుతో మావోయిస్టులు మళ్లీ పుంజుకుని పాగా వేసేందుకు సిద్దమవుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.ఎందుకంటే ఈయువకులిద్దరు ఒకప్పుడు మావోయిస్టుల ప్రాభల్యం ఎక్కువగా ఉన్న అటవీ,గిరిజన ప్రాంతానికి చెందినవారు. మావోయిస్టులను పూర్తిగా ఏరివేసిన తరువాత మనరాష్ట్రంలో అందులోని ప్రత్యేకించి వీరి పట్టు ఎక్కువగా ఉన్న ఉత్తరతెలంగాణాలో మళ్లీ పాగావేసి పుంజుకునేందుకు మావోయిస్టులు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు.రిక్రూట్ మెంట్లకు ప్రయత్నిస్తే కూడా ఎవరు వెల్లడం లేదు.ఈపద్దతిలో యువతను చేరదీయవచ్చన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్నది కూడా ఉత్తరతెలంగాణ లోనే. పోలీసులకు చిక్కకుండా ఉండకలిగే అటవీ,గుట్టప్రాంతాలు ఉన్నది కూడా ఉత్తరతెలంగాణలోనే దీంతో తెలంగాణ సాయుధపోరాటం పేరుతో యువకులను చేరదీసి వారితో సంఘవిద్రోహ,చట్టవ్యతిరేక పనులు చేయించి వారిని పూర్తిగా బయటతిరగలేని విధంగా చేస్తే, ఆతర్వాత వారికి మద్దతు అంటూ మావోయిస్టులు రంగప్రవేశం చేసి వారిని తమతో కలుపుకుని బలోపేతం అవ్వాలన్న అతిపెద్ద వ్యూహం దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సాయుధపోరాటానికి దిగుతున్న వారికి ఈఆలోచన లేకున్నా భవిష్యత్తులో తప్పనిసరిగా ఇలా మారాల్సివస్తుందన్నది నిజం. మొగ్గలో ఉన్నప్పుడే దీనిని తుంచాల్సిన అవసరం ప్రభుత్వానికే కాదు ఇప్పుడు తెలంగాణకోసం పోరాడుతున్న రాజకీయ,ఉద్యోగ,ఉపాద్యాయ ఇతర అన్ని సంఘాలకు ఉంది. 66సంవత్సరాల స్వాతంత్ర్యసంబరాలు జరుపుకున్నవేల ఒక్కసారి గతాన్ని నెమరువేసుకుందాం. స్వాతంత్ర్యం కోసం ఆనాడు సుభాష్ చంద్రబోస్ సాయుధపోరాటం ఎంచుకున్నారు.గాంధీజి అహింసా మార్గాన్ని ఆయుధంగా వాడారు.ఈరెండింటి వల్ల వచ్చిన పలితాలను బేరీజువేసుకుని తెలంగాణ యువత పెడదోవ పెట్టకుండా చూడాల్సిన భాద్యత ప్రతిఒక్కరిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: