రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు బిజేపి పక్కా వ్యూహంతో ముందుకు వెలుతోంది. కమలపరిమళాలు వెదజల్లేందుకు పయనం మొదలుపెట్టింది. కమలనాథులు వేస్తున్న అడుగులు ఈవిషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముందునుంచి అంతోఇంతో పట్టున్న తెలంగాణలో బలంపెంచుకుని,కర్ణాటకలో వలే రాష్ట్రంలో అధికారం విషయంలో నిర్ణయాత్మకంగా మారాలన్నది ఆపార్టీ లక్ష్యం. అందుకు తన బలం లేని సీమాంధ్రప్రాంతాన్ని పక్కనపెట్టి తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించి,దీనికి ఆపార్టీ సీమాంధ్రనేతలతో సైతం సై అనిపించింది. ఇది తెలంగాణలో మంచిపలితాన్ని ఇప్పటికే ఇచ్చింది. ఇక దీనిని వదలకుండా మరింత ముందుకు పోయే పనిలొపడింది. ఆపార్టి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ కోసం ఢిల్లీ వేదికగా సత్యాగ్రహ దీక్షకు ముహూర్తం ప్రకటించారు.దీనికి మద్దతుగా తెలంగాణవాదులు కలసివచ్చే ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే రాజ్యసభలో ప్రైవేటు తీర్మాణాన్ని ప్రవశపెట్టింది. తెలంగాణ కోసం సై అన్నందుకు సిపిఐకి టీజేఏసి వెల్లి మద్దతు ప్రకటించింది.అంతకంటే కీలక అడుగులు వేస్తున్న బిజేపికి మద్దతు తెలుపాల్సి వస్తుంది. ముందుగా పోతున్నప్పుడు దానికోసం పనిచేసేవన్ని ఒకటి  దాని తర్వాత ఒకటి మద్దతుగా రావాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. టీఆర్ఎస్ కు కూడా బిజేపికి మద్దతిచ్చే పరిస్థితులు వస్తాయి. కారణం సిపిఐకి,వైకాపాకు,చివరకు టీఆర్ఎస్ కు కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. ఉన్నది ఒక బీజేపికే. కాంగ్రేస్ కు ఉన్నప్పటికి అది ఇప్పట్లో కాదుకదా మున్ముందు కూడా స్పష్టత ప్రకటించే పరిస్థితులు ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కనిపించడం లేదు. దీంతో తెలంగాణపై మమకారంతో కాకపోయినా రాజకీయప్రయోజనాల కోసమైనా బిజేపి బాటపట్టాల్సి రావచ్చు. ఇవేవి జరుగక పోయినా తెలంగాణ ప్రజల్లో పెద్దపార్టి,అధికారం దక్కించుకునే అవకాశం ఉన్నపార్టీ అన్నభావాన్ని పెంచగలిగినా బిజేపి ప్రయోజనం పొందవచ్చు. ఎంతైనా ఇప్పుడున్న దానికంటే కొంతైనా రాష్ట్రంలో బలాన్నిపెంచుకోవచ్చు అన్నది కమలనాథుల ఖచ్చితమైన వ్యూహంగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: