హైదరాబాద్: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ కచ్చితమైన క్లార్టీకి వస్తోంది. తెలంగాణను టీడీపీ అనుకూలంగా ఉన్నట్లు చెప్పబోతోంది. తెలంగాణకు టీడీపీ అనుకూలంగా ఉందంటూ కేంద్రానికి మరోమారు లేఖను ఇవ్వబోతున్నట్లు టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఇప్పటి దాకా తెలంగాణ విషయంలో టీడీపీ క్లార్టీ లేనందునే తెలంగాణ ఇవ్వడంలో కేంద్రం జాప్యం చేస్తున్నట్లు అటు అధికార కాంగ్రెస్,ఇటు తెలంగాణ కోసం కొట్లాడుతున్న టీఆర్ఎస్ చెబుతూ వస్తున్నాయి.  అయితే, టీడీపీ మాత్రం తెలంగాణకు వ్యతిరేకంగా లేదనీ చెబుతున్నప్పటికీ...మరోమారు కేంద్రానికి లేఖ ఇవ్వాలనీ అన్ని వైపుల ఒత్తిళ్లు రావడంతో వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణాకు టీడీపీ అనుకూలంగా ఉన్నట్లు లేఖను ఇవ్వబోతోంది. ఇక ఇప్పటిదాకా టీడీపీ లేఖ ఇవ్వకపోవడంతోనే కాంగ్రెస్ ఏమీ చేయలేకపోతుందనీ సాకులు చెబుతూ తప్పించుకుంటుంది. అయితే, ఇప్పుడు టీడీపీ లేఖ ఇస్తుండటంతో అధికార కాంగ్రెస్ ఏం చేయబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్రం కూడా టీడీపీని సాకుగా చూపెట్టి తెలంగాణపై సాగదీస్తుంది. ఇప్పుడు టీడీపీ లేఖ ఇస్తే సాకులు చెప్పి తప్పించడానికి అవకాశం లేదు. అసలు అవకాశవాదులెవరో తేలిపోనున్నది. ఇప్పుడు అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. టీడీపీ లేఖ ఇచ్చిన తరువాత కూడా తాత్సారం చేస్తే కాంగ్రెస్ తగు మూల్యం చెల్లించుకోకతప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: