హైదరాబాద్: రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆదివారం సీమ సమావేశం జరిగింది. రాష్ర్ట విభజన జరిగితే రాయలసీమను కూడా ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటు చేయాలంటూ బైరెడ్డి గత కొన్ని రోజులుగా ఉద్యమిస్తున్నాడు. రాష్ర్టాన్ని ఉంచితే సమైక్యంగా ఉంచాలనీ లేదంటే మూడు రాష్ర్టాలుగా విభజించాల్సిందేనంటూ నిన్నటి వరకు సీమలో ఉద్యమాలను చేస్తున్న బైరెడ్డి ఈరోజు ఏకంగా తెలంగాణలోని హైదరాబాద్ గడ్డపైనే సీమ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. బైరెడ్డి ఏర్పాటు చేసిన సీమ ప్రత్యేక సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వేలాది మంది హాజరయ్యారు.
పార్టీలకతీతంగా బైరెడ్డి ఏర్పాటు చేసిన మీటింగుకు వచ్చారు. ఈ సమావేశంలో ప్రత్యేక రాయలసీమ ఆవశ్యకతపై చర్చించారు. సకల సంపదలున్న రాయలసీమ అనేక విధాలుగా అణచివేతకు గురైందనీ, రాష్ర్టాన్ని తప్పని సరి పరిస్థితుల్లో విభజిస్తే సీమను కూడా ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటు చేయాల్సిందేననీ సమావేశానికి హాజరైన వక్తలందరూ డిమాండు చేశారు. మొత్తానికి సీమపై హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకోవడం...దానికి వేలాది మంది హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.
మరింత సమాచారం తెలుసుకోండి: