హైదరాబాద్: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ రాష్ర్టపతి అభ్యర్థిని ప్రకటించింది. మందు నుంచి చెబుతూ వస్తున్నట్లుగానే ప్రణబ్ ముఖర్జి పేరును ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఖరారు చేసిం. అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీని కోసం గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రణబ్ను రంగంలోకి దించాలనుకుంది. అయితే, యూపీఏ భాగస్వామ్యమైన త్రుణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జి ప్రణబ్ అభ్యర్థితత్వాన్ని వ్యతిరేకించింది. అయినప్పటికీ మిత్రురాలు బెదిరింపులకు సోనియాగాంధీ ఏ మాత్రం అదరలేదు, బెదరలేదు. ఆ పార్టీ ముందునుంచీ చెబుతున్నట్లుగానే ప్రణబ్ ను అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్కు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ రాష్ర్టపతి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సోనియాగాంధీ పక్కా వ్యూహంతో ముందుకెళ్లున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: