తుపాకి నీడలో తెలంగాణ జనం నిద్రపోతున్న సమయంలో ఆయన రాజ్యాన్ని ప్రశ్నించిన తీరు తెలంగాణ ప్రాంతంలో బాధలు అనుభవించిన అందరికి గుర్తుకుంటుంది. ఆయనే ప్రజాకవి కాళోజీ నారాయణరావు. కాళన్న జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న జరుపుకుంటారు. 98వ జయంతి సందర్భంగా కాళన్న యాదిలో ఆయన గూర్చి చెప్పాలనుకుంటే మస్తుగా ఉంది. కాని ఆయన గూర్చి కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం. దేశసరిహద్దులను కాపుకాయాల్సిన భద్రత దళాలు తెలంగాణ పల్లెలను చుట్టుముట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.
నక్సలైట్లు పరాయి దేశస్తులు కాదని, ఓరుగల్లు, కరీంనగర్ వంటి తెలంగాణ జిల్లాలు భారతదేశంలో అంతర్భాగంగా వున్నటువంటి ప్రాంతాలే కాని, శత్రుశిభిరాలు కాదని కాళోజీ నినదించారు. నిరంకుశ పాలకులకు, ప్రజాస్వామ్య వ్యతిరేకులకు కాళోజి సింహస్వప్నమయ్యారు. కాళోజి ప్రజాస్వాయ్య ప్రియుడు, గాంధీ భక్తుడు, నెహ్రూ రాజ్యంలో పేదల కష్టాలు తీరుతాయని విశ్వసించి భంగపడిన స్వాతంత్ర్య సమరయోదుడు, నిండుగుండెల సూరీడు.
తెలంగాణలో ఏ చిన్న నిస్సురవ్వ రగిలినా, అది నిజాం వ్యతిరేక పోరాటమెకానీ, విశాలాంధ్ర స్వప్నమేకానీ, ఆదివాసుల అటవి తిరుగుబాటు ఉద్యమమం, గ్రంధాలయోధ్యమమం కానీ, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలే కాని తల్లి కోడిలెక్క ఆయా భావిధారలకు , పోరాట భూమికలకు కాపుకాశారు.
తెలంగాణ ప్రాంతంలో ఏ పాప ఏడ్చినా, ఏ తల్లి గుండె పగిలినా, ఏ పల్లే గాయాలపాలైనా, ఏ వీరుడు నేలకొరిగినా, ఏ సందర్భంలోనైనా స్వేచ్చ చెరసాల పాలయినా కాళోజీ కదిలిపోయేవారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తానే ముందుండి ప్రజాస్వామిక పోరు సలిపేవారు. ప్రజలందరి గొడవను తన గొడవగా చేసుకొని శక్తివంతమైన రాజ్యానికి ఎదురొడ్డిన ధీరోదత్తుడు కాళోజీ. దౌర్జన్యాన్ని ప్రశ్నించడం, అన్యాయాన్ని ఎదిరించడం అనేది ఆయనకు పుట్టుకతో వచ్చిన అలవాటు. తాను తన నిరసన చేయాలనుకున్నప్పుడు ఎవరు అడ్డం వచ్చిన ఆగేవారు కాదు. చివరకు ప్రధాన మంత్రిని సైతం ప్రశ్నించిన గుండె దైర్యం కాళోజీది. ధాశరధి తెలంగాణ గుండెపై కోటిరతనాల వీణను పలికిస్తే, తెలంగాణ గుండెఘోషను నాగొడవగా వినిపించిన ధన్యజీవి. పోరాటశీలి, చైతన్య పతాక కాళోజీ.
మరింత సమాచారం తెలుసుకోండి: