తెలంగాణ కోసం ఆందోళన చేయడం. ఆపై వెనువెంటనే విరామం ప్రకటించడం. ఉవ్వెత్తున ఉద్యమాలు చేపట్టడం తదుపరి తాత్కాలికంగా నిలిపివేయడం. సమ్మె సైరన్ మోగించడం అధిష్టానం కనుసైగలకు కరిగి సైలెంట్ గా ఉండటం. వెరసి తెలంగాణ సెంటిమెంట్ పట్ల నేతలు సీరియస్ గా పనిచేయడం లేదని తెలుస్తోంది.  తెలంగాణ సెంటిమెంటుకు రాజకీయ నాయకులు అయింటు మెంటు పూస్తూనే ఉన్నారు. కేవలం ఓట్ల కోసం తెలంగాణ వాదాన్ని అన్ని పార్టీలు భుజాన ఎత్తుకుంటుండటం రాజకీయ ఎత్తుగడేనని తెలియకనే తెలుస్తొంది. గతంలో అంటే 2009లో ఐదేళ్లపాటు అధికారం లేకుండా మూలకు కూర్చున్న తెలుగుతమ్ముళ్ళు అధికారం కోసం అడ్డదారులు తొక్కారు. అప్పటి వరకు సమైఖ్యాంధ్ర అన్న వారు తెలంగాణవాదాన్ని భుజాన ఎత్తుకున్నారు. అంతటితో ఆగక తెరాస మరియు వామపక్షాలతో జట్టుకట్టారు. కేవలం అధికారం కోసమే నాడు తెలుగుదేశం జై తెలంగాణ అన్నది తెలియంది కాదు. మహానేతను మట్టికరిపించేందుకు మహాకూటమి ఏర్పాటు చేశారు.  సిద్ధాంతాలను పక్కన పెట్టి భావసారూప్యత లేని పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా అప్పట్లో ఆవిర్భవించిన విషయం విథితమే. అలాగే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా తిరిగి తెలంగాణ వాదం వినిపించేందుకు తెలుగుతమ్ముళ్ళు ఉబలాటపడుతున్నారు. వామపక్షాలు సైతం తెలంగాణ సెంటిమెంటును ఆయింట్మెంట్ లాగా వళ్ళంతా పూసుకుంటున్నాయి. కాగా నాడు వైఎస్ తనదైన శైలిలో తెలంగాణ ఏర్పాటుకు ప్రత్యేక కమిటీ వేశాం. చిన్నరాష్ట్రాల విషయంలో అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమంటూ తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఎవరంతకు వారు తెలంగాణపై పెదవి విప్పితే ఊరుకునేది లేదని ఖరాఖండిగా హెచ్చరించారు. అయినప్పటికీ కేశవరావు.జానారెడ్డి.ఎంఎస్ సత్యనారాయణ తదితరులు తెలంగాణపై వాఖ్యలు చేయడం విధితమే. దీంతో ఎన్నికల్లో విజయానంతరం వైఎస్ వారిని దూరం ఉంచిన సంగతి తెలియందికాదు. వైఎస్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ వాదం వినిపించిన వారికి తిరిగి పదవులు దక్కాయి. ముఖ్యంగా జానారెడ్డి మరియు శంక్రరావు. కేశవరావు తదితరులు తిరిగి తెలంగాణ వాదం వినిపించి పదవులు దక్కించుకోవడం జరిగింది. తెలంగాణపై తేగెసి చెబితే పదవులు వస్తాయని కాంగ్రెస్ నేతలు భావించడం విచారకరం. సర్కరులో పదవులు సాధించుకోవడం కోసమే తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడం జరిగిందన్నది జగమెరిగిన సత్యం. కాగా తెలంగాణ సెంటిమెంట్ ను నినాదంగా చేసుకున్న తెరాస సైతం 2004లో కాంగ్రెస్ వారితో 2009లో తెలుగుదేశంతో జతకట్టి ఎన్నికల బరిలోకి దిగింది. నిత్యం సమైఖ్యవాదం వినిపించే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్లే 2009లో ఘోరంగా ఓటమి చవిచూశామని తెరాస గ్రహించింది. అలాగే తెలంగాణ వాదం వినిపించే తెరాసతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగాల్సిందని తెలుగుదేశం పార్టీ ఆలస్యంగా గుర్తించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు సదరు తెదెపా తెరాస చేసిన పొరపాట్ల వల్ల తిరిగి కాంగ్రెస్ కు అధికారం దక్కిందని నిక్కచ్చిగా చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు తెలంగాణ సెంటిమెంటును సెటిల్మెంట్ గా వాడుకోవాలని చూస్తే ఓటు రూపంలో గుణపాఠం చెబుతారని అన్ని పార్టీలు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. లేని పక్షంలో ఆయా పార్టీలకు నిత్యం ప్రతిపక్ష ఖాయం.  

మరింత సమాచారం తెలుసుకోండి: