రాజకీయాల్లోకి రాను రానంటోంది ప్రియాంక. రాయ్ బరేలీ నుంచి పోటిచేసే ప్రసక్తి లేదంటోంది. దశాబ్దకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ప్రియాంక వాఖ్యలు పెనుదుమారాన్నే లేపుతున్నాయి. కాంగ్రెస్ కంచుకోటలైన అమేథీ మరియు రాయ్ బరేలీలలో రాజకీయ నేతలతో సత్సంబంధాలున్న ప్రియాంక ఉన్నట్టుండి రాజకీయ రంగ ప్రవేశంపై ఆవేశంగా ప్రకటనలివ్వడంపై ఆమె అంతరార్థం అర్థం కావడం లేదు.  ముఖ్యంగా ఇందిరమ్మ హావభావాలున్న ప్రియాంకను రంగంలోకి దింపితే రాజకీయాలు ఊపందుకుంటాయని కాంగ్రెస్ మహిళా నేతలు మనసారా కోరుకుంటున్నారు. కాగా రాహుల్ గాంధీ వర్గంలో యువనాయకులు సోనియా సన్నిహిత వర్గాల మధ్య స్వల్ప విభేధాలున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రియాంక రాజకీయాల్లోకి వస్తే మరో వర్గం ఏర్పడటం ఖాయమని కాంగ్రెస్ పార్టీలోని తటస్థులు తటపటాయిస్తున్నారు.  అయితే రాజకీయాల్లోకి రానని ఖరాఖండిగా ప్రియాంక తేల్చిచెప్పడంతో కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇదిలఉండగా అమ్మడికి అడుక్కుని అధికారం అప్పజెప్పాలేమో మరి. రాజకీయాల్లో ఏనిమిషం ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: