హైదరాబాద్: రాష్ర్టపతి అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర ఆర్థిక శాఖామంత్రివర్యులు ప్రణబ్ ముఖర్జీ రాష్ర్టానికి రానున్నారు. వచ్చే నెల 1న ప్రణబ్ హైదరాబాద్కు రానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలో రాష్ర్టపతి ఎన్నికలు జరగనున్నాయి. అయతే, ఆయన ఈ నెల 25న తన మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. రాష్ర్టపతి అభ్యర్థిగా యూపీఏ పక్షాన పోటీకి దిగుతున్న ప్రణబ్ వచ్చే నెల 1న రాష్ర్టానికి రానున్నారు. రాష్ర్టపతి అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న ఆయన రాష్ర్టంలోని ఆయా పార్టీలను కలిసి మద్దతు కోరే అవకాశాలున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: