ఇకనుండి ఎప్పుడుపడితే అప్పుడు పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండదు. అందుకే ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగానే పేట్రోల్ పోయించుకోవడమో లేదా పెట్రోల్ బంక్ లు తీసి ఉన్నప్పుడో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. లేదా ఎక్కువ డబ్బులు చెల్లించి బ్లాక్ లో పెట్రోల్ కొనుగోలు చేయాలి. ఇలా ఇకనుండి పెట్రోల్ వినియోగ దారులు ఇబ్బందులను ఎదుర్కొనున్నారు.
సాయంత్రం తర్వాత వాహనంలో పెట్రోల్ అయిపోతే ఎక్కడ చూసిన బంక్ లు తెరిచి ఉండవు కాబట్టి వాహనాలను అక్కడే వదిలివేయడమో లేదా వాటిని తిన్నగా తోసుకుంటు రావడం జరుగుతుంది. అందుకే వాహనం ఎక్కే సందర్భంగా ముందుగా పెట్రోల్ ఉందో లేదో ఒకటిరెండుసార్లు పరిశీలించుకోవాలి. బంక్ లు ఉదయం 8-30గంటల నుండి సాయంత్రం 5-30గంటల వరకు పనిచేస్తాయి. మధ్యాహ్నం 1గంటనుండి 2గంటల వరకు బోజన విరామం కూడా ఉంటుంది.
దేశవ్యాప్తంగా సోమవారం నుండి అన్ని పెట్రోల్ బంక్ లు ఒకటే షిఫ్ట్ మాత్రమే పనిచేయనున్నాయి. ఈ విషయాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. పెట్రోలియం డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్రప్రభత్వం అనుసరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోత మూలంగా జనరేటర్ల సహాయంతో బంక్ లు నిర్వహించడంతో బంక్ ల నిర్వహకులకు నష్టం వాటిల్లుతుంది. పెట్రోల్ ధర లీటరు 6రూపాయలకు ఇచ్చినటువంటి కమీషన్ ఇప్పుడు పెట్రోల్ ధర ఇంత పెరిగిన అదే కమీషన్ ఇస్తుందని. దీంతో టాక్సీ కూడా ఎక్కువ పెరిగిందని ఇటువంటి పరిస్థితిలో బంక్ లు నడుపడం కష్టంగా తయారైందని నిర్వహకులు వాపోతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: