తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తప్ప మరొకటి వద్దంటూ తెలంగాణ వ్యతిరేకులంటూ ఎవరినిపడితే వారిని పేర్కొంటూ ఇన్నాళ్లు గర్జించిన జేఏసి ఇప్పుడు గారాబం చేయడం మొదలుపెట్టింది. వెన్నుచూపితే వెంటాడుతారని, ఎదురుతిరిగితేనే ఏదైనా సాధ్యమని తాము చెప్పిన మాటలు తమ గూబనే గుబెల్లు మనిపిస్తాయని అనుకోలేదు జేఏసి. ఈమాటలు తెలంగాణ వాదానికి వ్యతిరేకం కాదు సుమా... కాని అతి చేయడం అసలుకే చేటు అన్నది మనవారికి తెలియడం కోసం. ఇన్నాళ్లు తెలంగాణ మంత్రులు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని, లేనట్లయితే పుట్టగతులుండవని హెచ్చరికలు జారిచేసారు. అలా చేయకపోతే తెలంగాణ వాసులు వారి మెడలు వంచి చేపిస్తారని బెదిరింపు దోరణిలో హూంకరించారు. అసలు వారిని వారి కుటుంబసభ్యులే రానీయరంటూ కూడావాఖ్యలుచేసారు.ఇప్పుడేమయింది...ఉన్నమంత్రులకు మరో ఇద్దరు తోడయ్యారు, వారు చెప్పినవేవి జరగలేదు, జరిగే సూచనలు కన్పించడం లేదు. ఇన్నాళ్లు రాష్ట్రమంత్రులు కొంత భయపడి వారివెంట నడిచేందుకు సిద్దం కాగా, తాజా పరిణామాలు ఆపరిస్థితిని దూరం చేసాయి. వెన్నుచూపి పారిపోతే వెంటాడుతూ తరుముతారు, ఒక్కసారి వెనక్కి తిరిగి ఎదిరిస్తే ఎంతటి వారైనా తోక ముడుస్తారు అన్నది నిజమే అన్పించడం లేదు. పిల్లి అయినా సరే వేటాడుతున్న పులిపై తిరగబడితే ఆఅడవిరాజు కూడా కాస్తా వెనుకడుగేస్తారట. ఇప్పుడదే సీన్ టిజేఏసి లో కన్పిస్తోంది. రాష్ట్రంలోని టిమంత్రుల రాజీనామాను పక్కన బెట్టారు. కొత్త మంత్రులు సహకరించాలని జేఏసి చైర్మన్ కోదండరాం తాజాగా విన్నవించారు. దీనికంటే ముందు బాబు యాత్రను అడ్డుకుంటామన్నారు, అది బెడసికొట్టగానే అది కాదు, నిరసన తెలుపాలనుకున్నాం అంటూ రాజీమార్గం పట్టారు. నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్షను అడ్డదిడ్డంగా వ్యవహరించి వారి కోరికను గంగపాలు చేయెద్దని తెలంగాణ వారిని వేడుకుంటోందన్నది ఇప్పటికైనా గుర్తుంచుకోవాల్సిన అవసరం జేఏసిపై ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: