దూత ఎంఐఎం మద్దతు ఉపసంహరణతో ఆత్మరక్షణలో పడిన కాంగ్రెస్ హైకమాండ్ పరిస్థితులను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగింది. టీ కాంగ్రెస్ ఎంపీలు, కొందరు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నట్టు వస్తున్న నేపథ్యంలో వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర మంత్రి పల్లంరాజును హైకమాండ్ దూతగా నియమించింది. పల్లంరాజు పార్టీ సీనియర్ నేత కేశవరావును ఆయన నివాసంలో కలిశారు. ఇద్దరూ సుమారు అర్ధగంటసేపు చర్చలు జరిపారు. ఎంపీలెవరూ పార్టీని వీడకుండా చూడాలని, ఎంపీలు తప్పుకుంటే పార్టీకి నష్టమని అధిష్ఠానం మాటగా పళ్లంరాజు కేకే కు చెప్పారని సమాచారం. అటు కేకే కూడా తెలంగాణకు అనుకూలంగా త్వరగా నిర్ణయం తీసుకోవాలని, అలా చేస్తే పార్టీని ఎవరూ వీడరని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. --- 

మరింత సమాచారం తెలుసుకోండి: