టిఆర్ఎస్ లో చేరడం కోసం ముగ్గురు మంత్రులతో పాటు 15మంది ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారని ఆపార్టీ అధినేత కెసిఆర్ మరో బాంబు పేల్చారు. ఇప్పటికే తనతో పలువురు టిఆర్ఎస్ లో చేరే విషయంపై చర్చించారని ప్రకటనచేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ముగ్గురు మంత్రులతో పాటు టిడిపికి చెందిన 15మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరే విషయంపై ఇదివరకే చర్చించడం జరిగిందని వారంత తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. వారి పేర్లు మాత్రం చెప్పడానికి నిరాకరించారు. టిడిపికి, అధికారపార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇదివరకే టిఆర్ఎస్ చేరిపోగా మరికొంత మంది చేరడానికి సిద్దంగా ఉన్నారని కెసిఆర్ సంచలన ప్రకటన చేయగా చేరేవారెవరనే విషయంలో ఆయాపార్టీలు గందగోళంలో పడే అవకాశముంది. కాగా చేరేవారు డిసెంబర్ 9తర్వాత బయటకు వచ్చి టిఆర్ఎస్ లో చేరిపోతారని కెసిఆర్ చెబుతుండగా ఆ ముగ్గుర మంత్రులు ఎవరనేది చర్చనీయాంశమైంది. కాగా మరో 7గురు అధికారపార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు తనతో మాట్లాడుతున్నారని వారంత డిసెంబర్ 9తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెబుతుండగా ఇది వరకు ఎంత వరకు నిజమనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది. తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉండి తెలంగాణ కోసం పోరాడుతామని ఎంపీలు చెబుతుండగా, టిడిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా కెసిఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్దంగా లేనట్లు తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితిలో కెసిఆర్ ఇటువంటి ప్రకటన చేయడం ఎంత వరకు వాస్తవమో వేచిచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: