గ్రొమోర్ ఎరువుల గురించి రాష్ట్రంలో తెలియని రైతులంటూ ఎవరూ ఉండరు. ఈ కంపెనీపై రైతులకు నమ్మకం ఎక్కువే. ఈ కంపెనీ గ్రామీణ, చిన్న చిన్న పట్టణాల్లొ రైతుల కోసం ఔట్ లెట్లను ఏర్పాటు చేసి ఎరువులను, పురుగుల మందులను విక్రమయిస్తోంది. అయితే ఇక్కడ విక్రయిస్తున్న కొన్ని పురుగుల మందుల్లో నాశిరకం మందులన్నట్లు తేలింది. అసిఫెట్ 75 ఎస్, పి 111111901 బ్యాచ్కు చెందిన అసిఫెట్ సాలిబుల్ పౌడర్ ప్చాకెట్లు పరిశీలించగా ఈ విషయం తేలింది. ఐఎస్ఐ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సిన ఈ మందులు అత్యంత నాశిరకంగా ఉన్నట్లు తేలింది. ఈ విషయం మొదట గుంతకల్లులో బైట పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రోమోర్ ఔట్ లెట్లపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. గ్రోమోర్ సంస్థ బహుళ జాతి సంస్థ అయినప్పటకీ, ఇక్కడ లభించే ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ నాశిరకం క్రీమిసంహారక మందులను విక్రయించడం పట్ల రైతులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ధర ఎక్కువైనప్పటకీ ఇక్కడే తాము మందులు కొనుగోలు చేస్తున్నామని కానీ ఈ మందులు వల్ల తమ పంటలు పాడైతే నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: