పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ సెంచరీలలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని దాటేశాడు.  ఈరోజు టీ20 మ్యాచ్ లో సెంచరీ చేసిన బాబర్ పాకిస్థాన్ తరపున అత్యధిక శతకాలు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. నేడు రావల్పిండి వేదికగా జరిగిన జాతీయ టీ 20 కప్‌లో నార్తెన్‌తో సెంట్రల్ పంజాబ్ తరఫున ఆడుతు బాబర్ తన 6 వ టీ20 సెంచరీని సాధించాడు. పాక్ లో ఇంతకముందు అహ్మద్ షెహజాద్ మరియు కమ్రాన్ అక్మల్ 5 శతకాలు సాధించారు. అయితే ఈ సెంచరీతో అత్యధిక టీ 20 సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ అజామ్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. కోహ్లీ 315 మ్యాచ్‌ల లలో 5 సెంచరీలు చేయగా, బాబర్ 194 మ్యాచ్ లలో 6 సెంచరీలు చేశాడు. దాంతో బాబర్... రోహిత్ శర్మ మరియు షేన్ వాట్సన్ వంటి వారితో సమానంగా అత్యధిక టీ 20 సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో చేరాడు.

అత్యధిక టీ 20 సెంచరీలు సాధించిన బ్యాటర్లు :

క్రిస్ గేల్ - 448 మ్యాచ్‌ల్లో 22
మైఖేల్ క్లింగర్ - 206 మ్యాచ్‌ల్లో 8
డేవిడ్ వార్నర్ - 306 మ్యాచ్‌ల్లో 8
ఆరోన్ ఫించ్ - 324 మ్యాచ్‌ల్లో 8
ల్యూక్ రైట్ - 336 మ్యాచ్‌లలో 7
బ్రెండన్ మెకల్లమ్ - 370 మ్యాచ్‌లలో 7
షేన్ వాట్సన్ - 343 మ్యాచ్‌లలో 6
రోహిత్ శర్మ - 353 మ్యాచ్‌లలో 6
బాబర్ అజమ్ - 194 మ్యాచ్‌లలో 6

అయితే, సెంట్రల్ పంజాబ్ 20 ఓవర్లలో 200 పరుగులు చేసినప్పటికీ ఆ జట్టు నార్తెన్‌ చేతిలో ఓడిపోవడంతో బాబర్ అజామ్ రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ వృధా అయ్యింది. బాబర్ అజామ్ ఈ మ్యాచ్ లో మొత్తం 63 బంతుల్లో 3 సిక్సర్లు మరియు 11 బౌండరీలతో 105 పరుగులు చేసాడు. అయితే యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న టీ 20 ప్రపంచ కప్‌కు ముందు బాబర్ పెద్ద పరుగులు చేస్తుంటే కోహ్లీ మాత్రం పరుగులు చేయడానికి ఇబ్బంది న్పడుతున్నాడు. ఇక అక్టోబర్ 24 న దుబాయ్‌ వేదికగా భారత్‌ పాకిస్థాన్ ప్రపంచ కప్ టోర్నీలో తలపడనున్నాయి. చూడాలి మరి ఆ రోజు ఎవరు గెలుస్తారు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: