
ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఐదు విజయాలతో 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది పంజాబ్ జట్టు. కానీ ఆ జట్టులో నిలకడ లేకపోవడమే వారిని కలవరపెడుతోంది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ 528 పరుగులతో ఈ సీజన్లో మొదటి స్థానంలో ఉండగా... మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 429 పరుగులతో ఉన్నాడు. కానీ మిగిలిన వారు ఎవరు రాణించక పోవడమే ఆ జట్టు కష్టాలకు ఒక కారణం. ఇక బౌలింగ్ లో మొహమ్మద్ షమీ. అర్ష్‌దీప్ సింగ్ అదరగొడుతున్నారు. అలాగే కీలకమైన సమయంలో రవి బిష్ణోయ్ కూడా రాణిస్తున్నాడు. అయితే ఈ రెండు జట్ల గత గత మ్యాచ్ ల ప్రదర్శన చూస్తే ఎవరు విజయం సాధిస్తారు అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే గత రెండు మ్యాచ్ లో ఓడిపోయిన చెన్నై ప్రస్తుతం పంజాబ్ జట్టు లాగే కొంత వెనుకబడి ఉంది. కాబట్టి ఇందులో ఎవరు విజయం సాధిస్తారు అనేది మ్యాచ్ అనంతరమె తెలుస్తోంది.