ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ప్రీమియర్ లీగ్లో భాగంగా ఎంతో మంది వివిధ దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. కొంత మంది ఆటగాళ్లు భీకరమైన పోరు కొనసాగిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఉండటం గమనార్హం. అయితే ఇలా బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్ లో కొంత మంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తే... అటు ఐపిఎల్ టీమ్ లు మాత్రం సంబరాల్లో మునిగి పోతున్నాయి. ఎందుకు అంటారా.. ఇటీవల జరిగిన మెగా వేలంలో ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో పలు ఫ్రాంచైజీలు కొనుగోలు చేసాయి. ఈ క్రమంలోనే ఇటీవలే వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో కోల్కత నైట్ రైడర్స్ జట్టు సంతోషం లో మునిగిపోయింది.



 ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో భాగంగా కొన్ని కోమిళ్ళ విక్టోరియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ వెస్టిండీస్ ఆల్రౌండర్. ఇక ప్రతి మ్యాచ్లో కూడా ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్లో భాగంగా చటోగ్రామ్ చాలెంజర్స్ సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో కేవలం 16 బంతుల్లోనే 5 ఫోర్లు 6 సిక్సర్లతో  విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 16 బంతుల్లో 57 పరుగులు చేశాడు సునీల్ నరైన్. ఇక ఇటీవలే ఫార్చ్యూన్ భారీషల్  తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లోనూ ఇదే తరహా బ్యాటింగ్ చేసి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు   ఫలితంగా ప్రస్తుతం సునీల్ నరైన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కమిల్లా విక్టోరియన్స్ జట్టు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్గా నిలిచింది.



 ఇటీవలే ఫైనల్ మ్యాచ్లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన సునీల్ నరైన్ 23 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు   దొరికిన బంతిని బౌండరీకి తరలించడంతో లక్ష్యంగా విజృంభించాడు.  కాగా సునీల్ నరైన్ ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ జట్టు లో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఆరు కోట్లు చెల్లించి కోల్కతా ఫ్రాంచైజీ అతని రిటైన్ చేసుకుంది. అయితే ఇక మెగా వేలం కి ముందు కూడా ఇదే రకంగా అద్భుతమైన ఫామ్లో కొనసాగి తన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేస్తూ ఉండడంతో ఐపీఎల్ లోని కోల్కతా జట్టు అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: