ఐపీఎల్ 14 సీజన్ లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుని 15 వ సీజన్ లోకి అడుగుపెట్టనుంది. మరో మూడు వారాలలో ఐపీఎల్ 15 స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ ఐపీఎల్ పాలక మండలి పర్యవేక్షణలో చక చకా జరిగిపోతున్నాయి. ఇంతకు ముందు వరకు ఐపీఎల్ ట్రోఫీ కోసం కేవలం 8 జట్లు మాత్రమే పోటీ పడేవి, కానీ ఈసారి ఆ సంఖ్య 10 కి చేరింది. దీనితో మ్యాచ్ ల సంఖ్య కూడా పెరిగింది. కాగా ఐపీఎల్ టైటిల్ కోసం పోరాడే 10 జట్లు కొత్త కొత్త ఆటగాళ్లతో కలకళలాడుతున్నాయి. ఈ సారి టైటిల్ కొట్టే సత్తా అన్ని జట్లకు ఉందని చెప్పగలం. అయితే కీలక సమయాలలో తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా ఆ జట్టు రాతే మారిపోయే అవకాశం లేకపోలేదు.

అయితే గత కొంతకాలంగా కేకేఆర్ జట్టును చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్ లలో రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గంభీర్ కెప్టెన్ గా ఉండగా సాధించింది. అయితే ఆ తర్వాత ఎవ్వరూ కెప్టెన్ గా సూట్ కాలేదు. ఈ విషయం అలా ఉంచితే చాలా సీజన్ లుగా కేకేఆర్ తో ఉన్న కరేబియన్ ఆటగాడు సునీల్ నరైన్ గురించి తెలిసిందే. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల ప్రతిభ అతని సొంతం. అయితే అది బ్యాట్ తో అయినా కావొచ్చు లేదా బంతితో అయినా కావొచ్చు. ఇతను ఒక మేటి ఆల్ రౌండర్ గా కేకేఆర్ జట్టులో ఉన్నాడు. అయితే ఎక్కువగా ఓపెనర్ గా వచ్చి జట్టుకు విజయాలను అందించాడు. అంతెందుకు 2014 లో కేకేఆర్ టైటిల్ కొట్టడంలో సునీల్ నరైన్ పాత్ర ఎంత ఉందో తెలియంది కాదు.

అయితే గత రెండు మూడు సీజన్ లుగా చూసుకుంటే సునీల్ నరైన్ ను ఓపెనర్ గా పంపకుండా కేకేఆర్ యాజమాన్యం తప్పు చేసింది. అందుకే అద్బుతమయిన ఫలితాలను అందుకోవడంలో విఫలం అయింది. ఈ సారైనా ఆ పొరపాటు చేయకుండా నరైన్ ను ఓపెనర్ గా పంపాల్సిందే అంటూ ఫ్యాన్స్ గోల చేస్తున్నారు. పైగా ఇపుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. గడిచిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మరియు ఇప్పుడు జరుగుతున్న ట్రినిడాడ్ టీ 10 లీగ్ లోనూ సత్తా చాటుతున్నాడు. కాబట్టి సునీల్ నరైన్ ఒకటి రెండు మ్యాచ్ లలో విఫలం అయినా ఓపెనర్ గా కొనసాగించాలి అని డిమాండ్ ఎక్కువవుతోంది. ఇక తుది నిర్ణయం జట్టు యాజమాన్యం మరియు కోచ్ లదే.


మరింత సమాచారం తెలుసుకోండి: